Collector | పరిష్కారం చూపాలి

Collector | పరిష్కారం చూపాలి
- అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
- జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్
Collector | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : అర్జీదారుడు తన సమస్యపై ఫిర్యాదు చేసినప్పుడు పరిష్కారం చూపేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను క్షేత్ర స్థాయికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు అర్జీలను స్వీకరిస్తున్నజాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ సువర్ణ, ఎస్డీసీ రామసుబ్బయ్య
ఈ కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.
