Polio vaccine | పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించాలి

Polio vaccine | పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించాలి

  • జిల్లా కలెక్టర్ రాజబాబు

Polio vaccine | ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : ఒంగోలు జిల్లాలో పిల్లలందరికీ రెండుచుక్కల పోలియో వ్యాక్సిన్ వేయించి మహమ్మారి నుంచి కాపాడాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని రాజీవ్ గృహకల్ప అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్ల లోపు పిల్లలు 2లక్షల 44వేల112 మంది ఉన్నారని, వారంద‌రికీ నూరుశాతం వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.

జిల్లాలోని అన్ని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్ వద్ద పిల్లలకు పోలియో వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. రాబోయే రెండు రోజులు వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్క‌లు వేస్తారని ఆయన చెప్పారు.

అనంతరం రాజీవ్ గృహకల్ప కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అర్బన్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ప్రాంగ ణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర రావు, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అన్నా కీర్తన, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply