Bantumilli | ప్రజల్లో మార్పురావాలి

Bantumilli | ప్రజల్లో మార్పురావాలి
- పారిశుధ్యం, స్వచ్ఛతపై అవగాహన పెంచుకోవాలి
- పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
Bantumilli | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బంటుమిల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

అనంతరం ఈనెల 21వ తేదీన జరిగే పోలియో డేను అందరం కలిసి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అవగాహన లోపంతో చేసే చిన్న పొరపాట్లు పసి పిల్లల జీవితానికి శాపం కాకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



