Pension | విశ్రాంత ఉద్యోగులకు అండగా

Pension | విశ్రాంత ఉద్యోగులకు అండగా

  • వారి సంక్షేమ‌మే కూటమి ప్రభుత్వం ల‌క్ష్యం
  • జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను

Pension | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : విశ్రాంత ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. బుధవారం జగ్గయ్యపేటలోని పోస్ట్ ఆఫీసు సమీపంలోని ఎన్జీవో పెన్షనర్ల బిల్డింగ్ , ఉక్కుకళ వేదికలో జాతీయ పెన్షన్ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ పెన్షనర్ల సంఘం, జగ్గయ్యపేట శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షనర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉదయభాను పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ సౌకర్యం కోసం 1982 డిసెంబరు 17న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివంగత జస్టిస్ వై.వి. చంద్రచూడ్ ఇచ్చిన మైలురాయి తీర్పుతో పెన్షనర్లకు భద్రత కలిగిందన్నారు. ఆ తీర్పు కోసం శ్రమించిన దివంగత డీఎస్. నకారా జ్ఞాపకార్థం పెన్షనర్స్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ధరణికోట వెంకటరమణ, విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply