Electricity | అందరూ ఆదా చేయాలి..

Electricity | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : విద్యుత్తును ప్రతి ఒక్కరూ ఆదా చేసుకోవాలని.. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తెలిపారు. జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ర్యాలీని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో అధికారులతో కలిసి ర్యాలీని ఆయన నిర్వహించారు. విద్యుత్ను ఆదా చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఎంతగానో విద్యుత్ ఉపయోగపడుతుందని తెలిపారు. 14 డిసెంబర్ 2025 నుండి 20 డిసెంబర్ 2025 వరకు జాతీయ ఇందన పొదుపు వారోత్సవాలు జరుగుతాయన్నారు. 30% పైగా కరెంట్ పొదుపు చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply