Tributes | నివాళులు..

Tributes | చల్లపల్లి, ఆంధ్రప్రభ : చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మట్టా నాగరత్నం అనారోగ్యం కారణంగా మరణించారు. సోమవారం ఉదయం వారి నివాసం వద్ద నాగరత్నం పార్థివ దేహాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు కొల్లూరి శామ్యూల్, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జుజ్జువరపు భాగ్యలరావు, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు పేరం నాగిరెడ్డి, కొమ్ముకూరి రాజశేఖర్, మోటుపల్లి లోకేశ్వరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు, తదితరులు పాల్గొని నాగరత్నం పార్థివ దేహానికి నివాళులర్పించారు.

Leave a Reply