22 carat | సామాన్యులకు దూరంగా బంగారం

22 carat | సామాన్యులకు దూరంగా బంగారం
భారీగా పెరుగుతున్న ధర
శుభకార్యాలు, మంచి రోజుల్లో బంగారం కొనుగోళ్లు
భారీగా కొంటున్న కేంద్ర బ్యాంక్లు
కోరిక ఉన్నా కొనలేని స్థితి
స్టాక్ మార్కెట్ల అనిశ్చితితోనే గోల్డ్కు డిమాండ్
ముంబై : బంగారం భారతీయుల జీవనంలో ఒక భాగమైంది. బంగారంతో ప్రజలకు లోతైన సాంస్కృతిక, భావోద్వేగ బంధం ఉంది. పెరుగుతున్న ధరలతో విని యోగదారులు వివాహాలు, శుఖ కార్యాల, పర్య దినాల సందర్భంగా అర్ధవంతమైన కొనుగోళ్లు చేయలేకపోతు న్నారు. బంగారం ఆర్ధిక భరోసా ఇచ్చే సాధనంగా కూడా ఉంది. 2025లో చుక్కలను తాకుతున్న బంగారం ధరలు ప్రజల భావోద్వేగ బంధం నుంచి దూరం చేస్తున్నాయి. చాలా మంది ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి సంద ర్భాల్లోనూ చాలా తక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తు న్నారు. చాలా కుటుంబాలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. ధరలు తగ్గుతాయని చాలా మంది నమ్ముతున్నారు. అందుకోసం వారు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జీఎస్టీతో కలిసి 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 1,36,660 రూపాయలు,
22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర జీఎస్టీతో కలిసి 1,26,651 రూపాయలుగా ఉన్నాయి. చివరికి 18 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 1,05,180 రూపాయలుగా ఉంది.

22 carat | సామాన్యులు కోరుకుంటున్నట్లుగా బంగారం ధరలు తగ్గుతాయా?
అందరూ తమకు ఇష్టమైన పసిడిని కొనుగోలు చేసేలా అందుబాటులోకి ధరలు దిగి వస్తాయా? ధరల విషయంలో అంతర్జాతీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్ని ప్రధానం. బంగారం ధరల పెరుగుదలకు అనేక లోతైన కారణాలు ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆసియా దేశాలు, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల కేంద్ర బ్యాంక్ లు గత 40 సంవత్సరాల కంటే భిన్నంగా సంవ……………..మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
