Honor | సర్పంచ్ అశోక్ రెడ్డికి ఘన సన్మానం

Honor | రాయపోల్, ఆంధ్రప్రభ : రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామ సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికైన సత్తు అశోక్ రెడ్డి ఆదివారం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని తొగుట మండలం తుక్కాపూర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ రెడ్డిని చెరుకు శ్రీనివాస్ రెడ్డి శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రజల విశ్వాసంతో సర్పంచ్‌గా ఎన్నికైన అశోక్ రెడ్డి నాయకత్వంలో తిమ్మక్కపల్లి గ్రామం మరింత అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి, అమర్ తదితరులు పాల్గొన్నారు.
