Korsa Ramesh | అభివృద్ధికి బాటలు వేస్తా

Korsa Ramesh | అభివృద్ధికి బాటలు వేస్తా
Korsa Ramesh | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అనంతారం సర్పంచ్ అభ్యర్థి కోర్స రమేష్ ప్రజలను కోరారు. శనివారం అనంతారం గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజలను కలసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయన్నారు. వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ అనంతారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేశారన్నారు. గ్రామంలోని ఇళ్ళు లేని లబ్ధిదారులను గుర్తించి 86 ఇందిరమ్మ గృహాలను అందచేసాయన్నారు. రైతు బంధు నిధులను ఏకకాలంలో అనంతారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జామ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.
గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలిచి తోడుగా ఉంటానని రమేష్ గ్రామ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గత మూడు సంవత్సరాలుగా కొంత మందికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వైద్య చికిత్స అవసరాలకు తోడుగా నిలిచానని.. వారికి సహాయం చేసానని చెప్పారు. అనంతారం పంచాయతీ సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే.. గ్రామ అబివృద్ధితో పాటు, ప్రజాసేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని.. గ్రామ ప్రజలకు కోర్స రమేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇంటింటికి తిరుగుతూ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందన్నారు. అనతారం గ్రామంలో జరుగుతున్న సర్పంచ్, వార్డు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని రమేష్ ఓటర్లను అభ్యర్థించారు.
