భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలో శుక్రవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో, స్థానిక ఎస్సై కే. సందీప్ మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. బస్టాండ్ ఆవరణలో చలి తీవ్రతతో తట్టుకోలేక ఇబ్బందిపడుతున్న ఓ వృద్ధుడిని గమనించిన ఆయన, వెంటనే స్పందించి సిబ్బందితో దుప్పట్లు తెప్పించి అందజేశారు.
చలి నుంచి రక్షణ కల్పిస్తూ వృద్ధుడిని ఆదుకున్న ఎస్సై సందీప్ చర్యలు అక్కడి వారిని మానవత్వంతో నింపాయి. రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తూ అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఎస్సై కే.సందీప్‌ను మండల ప్రజలు హృదయపూర్వకంగా అభినందించారు.

