ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చూడాలి

  • అదనపు కలెక్టర్ లెనిన్ వచ్చవల్ టోప్పో

నర్సింహులపేట, ఆంధ్రప్రభ: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం చేయరానని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వచ్చవల్ టోప్పో అన్నారు.

శనివారం ఆయన నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి, అధికారులకు సూచనలు అందించారు.

తొర్రూరు ఆర్డీఓ గణేష్, జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ విజేందర్ రెడ్డి, స్థానిక ఎంపీడీవో రాధిక, తహశీల్దార్ రమేష్ బాబు, ఎంపీఓ కిన్నర యాకయ్య పర్యవేక్షణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన సామాగ్రి, బస్సులలో రూట్ ద్వారా రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలకు తరలించబడ్డారు. స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపట్టారు.

మండలంలో 23 పంచాయితీలు ఉండగా, అందులో గోపాతండా పంచాయతీ ఏకగ్రీవం, మిగతా 22 పంచాయతీలకు 186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 22 ప్రెసిడింగ్ అధికారులు, 186 ఓపీలకు మరికొన్ని సిబ్బంది కేటాయించబడినట్లు తెలిపారు.

Leave a Reply