Anganwadi | సమస్యలు పరిష్కరించాలని..
కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల ఆందోళన
Anganwadi | శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ): అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె. నాగమణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు కె. కళ్యాణి, డి.సుధ డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, లబ్ధిదారులకు క్వాంటిటీ, పెరిగిన ధరలకనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అంతకు ముందు ఆర్బీ బంగ్లా జంక్షన్ నుంచి ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీలంతా కలెక్టర్ (Collector) కార్యాలయం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ధర్నా వద్దకు ఐసిడిస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐ.విమల ధర్నా వద్దకు వచ్చి.. అంగన్‌వాడీల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు.
ఈ ధర్నాలో సీఐటీయూ (CITU) జిల్లా నాయుకులు అల్లు సత్యనారాయణ, ఎన్వి. రమణ, ఆర్. ప్రకాశరావు, బి.మురళి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. సింహాచలం, ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయుకులు ఎన్. హైమావతి, పి. లతాదేవి, జల్లు. కాంచన, వి.హేమలత, ఆర్ చంద్రమౌళి, కెవి హేమలత, లక్ష్మి, ఆర్ అప్పమ్మ, యన్. వెంకటలక్ష్మి, ఆర్. ఆదిలక్ష్మి, యన్. బాలామణి, టి. రాజేశ్వరి,భాగ్యలక్ష్మి,సరోజిని, కె. సూర్యం పాల్గొన్నారు.

