Leaders Shocked :  బస్సు బోల్తాపై  చలించిపోయారు

   Leaders Shocked :  బస్సు బోల్తాపై  చలించిపోయారు

కేంద్రం రూ.2లక్షల పరిహారం

మెరుగైన వైద్యం అందిస్తాం

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

పీఎం ప్రధాని, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం  భరోసా

రంగంలో మంత్రులు

ఆంధ్రప్రభ, చింతూరు (అల్లూరి జిల్లా)

అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్ (Leaders Shocked ) ​ చలించిపోయారు. మృతుల కుటుంబాలకు బాసటగా నిలిచారు. ఈ దుర్ఘటనపై దిగ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

   Leaders Shocked

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు (Tulasi Ghat Road)  ఘాట్ రోడ్‌లో బస్సు ప్రమాదం (9 Dead ) జరిగింది. ఈ ప్రమాదంలో 9  మంది మృతిచెందిన దుర్ఘటనపై  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Ap CM Chandra Babu Naidu) తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం పై ఉన్నతాధికారులతో ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

   Leaders Shocked

   Leaders Shocked : ఈ ప్రమాదం బాధాకరం

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్ (Dy.Cm Pavan Kalyan) ​ విచారం వ్యక్తం చేశారు.   

   Leaders Shocked

చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా   సమాచారం సమాచారం అందిందని . మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూని డిప్యూటీ సీఎం తి తెలిపారు.  ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య (Best Medical Services)  సేవలు అందించాలని అధికారులకు సూచించారు.  బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా (Will Help)  ఆదుకుంటాంమని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.

     Leaders Shocked : మంత్రి సుభాష్ విచారం

   Leaders Shocked

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈరోజు ఉదయం (శుక్రవారం) టూరిస్ట్ బస్సు లోయలో పడి పలువురు మృత్యువాత పడిన   విషాద ఘటనపై  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ( Minister Subhash)   తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ పర్యాటక బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోవటం, ఈ ఘటనలో చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, చాలామంది తీవ్రంగా గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రమాద స్థలానికి  పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అంబులెన్స్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయని, గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించామన్నారు. ఘాట్ రోడ్డు, పొగమంచు, డ్రైవర్‌ అకస్మాత్తుగా స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నామని,  పోలీసులు క్రేన్‌లతో, వ్యాలీ రెస్క్యూ టీమ్స్  (Vally Recue Team)  సహాయక చర్యలు చేపడుతున్నాయని  తెలిపారు. ప్రమాదంలో  మరణించిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి సుభాష్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

     Leaders Shocked : పరిశ్రమల శాఖ మంత్రి  దిగ్ర్భాంతి

   Leaders Shocked

 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై  మంత్రి టీజీ భరత్ (Minister Tg Bharath)   దిగ్భ్రాంతి (Shock)  వ్యక్తం చేశారు. యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిన  ఘటనలో  పలువురు మృతి చెందడం బాధాకరం అన్నారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

     Leaders Shocked : ఆ కుటుంబాలకు అండగా నిలుస్తాం :  కందుల దుర్గేష్​  

   Leaders Shocked

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఘటనలో 9 మంది యాత్రికులు మృతి చెందడంపై పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh)  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  చింతూరు – మారేడుమిల్లి సమీపంలో తులసిపాక ఘాట్ రోడ్డు వద్ద బస్సు లోయలో పడి 17 మంది యాత్రికులకు గాయాలవడం అత్యంత విచారకర అన్నారు. ఘటన జరిగిందన్న వార్త తెలియగానే హుటాహుటిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కి కాల్ చేసి పరిస్థితిని మంత్రి దుర్గేష్​  పర్యవేక్షించారు.

 మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు.  క్షతగాత్రులకు  చింతూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారని, నిరంతరం వైద్యసాయం పర్యవేక్షిస్తున్నామని మంత్రి దుర్గేష్ వివరించారు.  అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం భద్రాచలానికి  తరలించామని అధికారులు తెలిపారుని, దుర్గేష్ ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతిని  మంత్రి దుర్గేష్ వ్యక్తం చేశారు.  ప్రమాదంలో  మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని (Patronage)  మంత్రి  భరోసా ఇచ్చారు.

Also Read : At China Wall Fatal Accident  :  9 మంది దుర్మరణం

Leave a Reply