Majority | ఆశీర్వదించండి… అభివృద్ధి చేస్తా…
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మడిపల్లి బాబు గౌడ్
Majority | ఆంధ్రప్రభ ప్రతినిధి, జనగామ : ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించండి.. గ్రామ అభివృద్ధికి పాటుపడతానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మడిపల్లి బాబు గౌడ్ అన్నారు. శుక్రవారం జనగామ మండలంలోని సిద్దంకి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచార కార్యక్రమం చేపట్టారు.
ఈసందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బాబు గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, గ్రామంలో ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తానన్నారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక సంఖ్యలో ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఓటర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

