మెస్సీతో మ్యాచ్.. సీరియస్‌గా సీఎం ప్రాక్టీస్ !!

ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కంకోల్‌లో ఉన్న వోక్సెన్ యూనివర్సిటీ (Woxsen University)ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యమంత్రి తన అధికారిక కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ఫుట్‌బాల్ మైదానంలోకి అడుగుపెట్టి, విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు.

ముందుగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ్‌ తో కలిసి యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ విభాగాల ఎగ్జిబిషన్ స్టాళ్లను కూడా సందర్శించారు. తరువాత ఆయన వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీని పరిశీలించారు.

Leave a Reply