Pushpalatha | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..

Pushpalatha | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..

గెలుపు దిశగా మేడవేని పుష్పలత తిరుపతి

Pushpalatha | ధర్మారం, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా అవకాశమివ్వాల‌ని మేడవేని పుష్పలత తిరుపతి కోరారు. ధర్మారం మండల కేంద్రం నుంచి మేడవేని పుష్పలత – తిరుపతి సర్పంచ్ బరిలో ఉన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటెయ్యాలని, ధర్మారంను అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రజలందరికీ అండగా ఉంటానని, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అండతో ధర్మారం మండల కేంద్రంలో మినీ స్టేడియం, గ్రంథాలయానికి నూతన భవనం, వారసంత కు శాశ్వత స్థలం ఏర్పాటు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, అర్హులైన వృద్ధులకు, వికలాంగుకు పెన్షన్లు అవినీతిరహిత పాలన అందిస్తామని తెలిపారు.

గ్రామ పాలకులం కాదని, ప్రజలకు సేవ చేసే సేవకులమని, వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పుష్పలత తిరుపతి కోరారు. ధర్మారం గ్రామస్తులతో పాటు వ్యాపార, వాణిజ్య వర్గాలు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ప్రచారంలో అందరి నోట పుష్పలత గెలుపు మాటే వినిపిస్తుంది. మిగతా అభ్యర్థుల కంటే ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. అందరిని కలుపుకుంటూ గెలుపు దిశగా ప్రయాణిస్తున్నారు. గతంలో గ్రామంలోని నిరుపేద ప్రజలకు అనేకరకాల సేవా కార్యక్రమాలు దంపతులు నిర్వహించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని, సేవ చేసేందుకు ముందు ఉంటానని భరోసా కల్పిస్తున్నారు.

Leave a Reply