Police Department | ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు

Police Department | ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు

  • జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS.
  • ఇన్సిడెంట్ ఫ్రీగా ఎన్నికలు నిర్వహించాలి.
  • ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

Police Department | మద్దూర్, ఆంధ్రప్రభ : మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కోస్గి, గుండుమల్, మద్దూర్, కొత్తపల్లి మండలాల్లో ఎన్నికల నిర్వహణను శాంతియుతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిపేందుకు నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ(Police Department) పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.

మద్దూరు, కొత్తపల్లి మండలాలకు గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు సిబ్బందికి మద్దూర్ మండలంలోని షా గార్డెన్ ఫంక్షన్ హాల్(Shah Garden Function Hall)లో మరియు కోస్గీ, గుండు మాల్ లో బందోబస్తు కు వచ్చిన పోలీసులకు పంచాక్షరి ఫంక్షన్ హాల్ లో ఎస్పీ భద్రత పరమైన సూచనలు చేశారు.

ఈ నాలుగు మండలాలకు మొత్తం 650 మంది పోలీసు ఫోర్స్ , 02 TSSP బెటాలియన్స్(02 TSSP Battalions), CID నుండి వచ్చిన ఫోర్స్ తో బారి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రతి గ్రామంలో భద్రతా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఈ నాలుగు మండలాల్లో మొత్తం 67 గ్రామ పంచాయతీలు ఉండగా, 12 ఏకగ్రీవం అయ్యావి అని, మిగతా 55 గ్రామపంచాయతీలకు పోలింగ్ నిర్వహణ జరుగుతోందని తెలిపారు.

అందులో 13 సమస్యాత్మ‌క‌ గ్రామ పంచాయతీలు ఉన్నాయి అని, అందులో 27 సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించబడినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సమస్యాత్మక గ్రామపంచాయతీలు పోలింగ్ కేంద్రాల(Polling Stations) వద్ద ఎక్కువ పోర్స్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు .

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… గ్రామపంచాయతీ ఎన్నికలు ఇన్సిడెంట్ ఫ్రీగా నిర్వహించాలని, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

విధి నిర్వహణలో బాధ్యత రాహితంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మద్దూరు, కొత్త పల్లి లో మండలాలకు మొత్తం 18 రూట్లు గా(18 Routes), కోస్గి , గుండు మాల్ మండలలో 15 రుట్లూ గా విభజించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

రూట్ మొబైల్ ఆఫీసర్లు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తూ ఉండాలని, గ్రామాలలో గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలని, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం, డబ్బులు పంపిణీ, రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పోలింగ్ బూత్ దగ్గర విధులు నిర్వర్తించే పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్స్ మైంటైన్(Queue Lines Maintenance) చేయాలని, ఎలాంటి గొడవలు జరుగకుండా శాంతియుతంగా పోలింగ్ జరిగే విధంగా చూడాలని ఆయన తెలిపారు.

పోలింగ్ బూత్ నుండి 200 మీటర్ల వరకు ప్రజలు దూరంగా ఉండాలనీ అత్యవసరమైతే వెంటనే సంబంధిత లోకల్ పోలీసులకు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కి సమాచారం ఇవ్వాలని అన్నారు. అందరూ శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా కష్టపడి బాగా పనిచేయాలని సూచించారు. ఎన్నిక సమయంలో ప్రతి పోలీసు అధికారి తన డ్యూటీని పూర్తిగా నిబద్ధతతో నిర్వర్తించి, న్యాయబద్ధంగా నిష్పక్షికంగా పనిచేయాలని ఎస్పీ స్పష్టం చేశారు.

ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకుని శాంతి భద్రతల(Law and Order)ను కాపాడడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ప్రతి సమస్యాత్మక గ్రామం–పోలింగ్ కేంద్రంలో అదనపు ఫోర్స్‌ను మోహరించి మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఎవ్వరినీ విడిచిపెట్టమని. అల్లర్లు, భయభ్రాంతులు సృష్టించాలని చూస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు(Legal Strict Actions) తప్పవు అని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవరైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతో చుట్టూ తిరిగే వ్యక్తులు, గుంపులు ఎవరైనా ఉన్నా వెంటనే అరెస్టులు చేసి, కఠినంగా వ్యవహరిస్తాం” అని స్పష్టం చేశారు.

ప్రజలు ధైర్యంగా, భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించాలని, అనుమానాస్పదంగా కనిపించే కార్యకలాపాలను వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ఈ సమవేశంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్ లు, సీఐ సైదులు, ఎస్సై లు విజయ్ కుమార్, బాలరాజు, పోలీసు అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply