CENTER | డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన

CENTER | డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన
CENTER | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : దస్తూరాబాద్ మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని నిర్మల్ జిల్లా ఎలక్షన్ (Election) అబ్సర్వర్ అయోషా ఖానం పరిశీలన చేశారు. ఈ సందర్బంగా ఎలక్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోని కౌంటర్ లను పరిశీలన చేసి ఇంచార్జి తహసీల్దార్ యాదవ రావు, ఎంపీడీఓ అరుణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలక్షన్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత పటిష్టంగా చేయాలని ఎస్ ఐ సాయికుమార్ కి సూచించారు.
