Majority | కాంగ్రెస్ అభ్యర్థులను

Majority | కాంగ్రెస్ అభ్యర్థులను

భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి

Majority | తొర్రూరు, ఆంధ్రప్రభ : ఈనెల 14న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మహిళా మండల నాయకురాలు మాలోతు సునీత రాజేందర్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఈదులకుంట తండా, భోజ్య తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రజిని బానోతు, మాలోతు కాలిలను గెలిపించాలని కోరుతూ ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా సునీత రాజేందర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్ గా గెలిపిస్తే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఝాన్సీ రెడ్డిల సహకారంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న అసైన్ ల్యాండ్, దేవదాయ భూముల సమస్యను పరిష్కరిస్తానని, గ్రామంలో అన్ని వీధుల్లో వీధిలైట్లు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మాణం జరుగుతుందన్నారు. గ్రామాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఇన్చార్జీలు కంచర్ల వెంకటాచారి, కల్లూరి కుషాల్, జంజీరాల మనోహర్, కాంగ్రెస్ నాయకులు మాలోత్ శంకర్, మాలోతు రవీందర్, మాలోత్ గణేష్, బానోతు వెంకన్న, బానోతు తేజ నాయక్, యాకూబ్, బాబురావు, గోపి సింగ్, మాలోత్ శ్రీను నాయక్, సురేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply