Pariksha Pe Charcha | రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ

Pariksha Pe Charcha | రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ

  • ప్రధానమంత్రి పరీక్ష పే చర్చ 2026
  • రిజిస్ట్రేషన్‌కు ఆఖ‌రి గ‌డువు జనవరి 11

Pariksha Pe Charcha | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో నిర్వహించే పరీక్షా పే చర్చ 9వ విడత కార్యక్రమం జనవరి 2026లో జరగనుందని రాష్ట్ర విద్యాశాఖ ఎస్‌సీ ఈఆర్‌టీ డైరెక్టర్, పరీక్షల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) తెలిపారు. ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్రారంభం అయిందన్నారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ వచ్చే ఏడాది జనవరి 11 తేదీ లోపల రిజిస్ట్రేషన్(Registration) చేసుకోవాలని సూచించారు.

ఈ పరీక్ష పే చర్చకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీచర్లు, తల్లిదండ్రులు అర్హులుగా(to deserve) నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలా అనే విధానంను తెలియపరిచారు. జనవరి 12వ తేదీ నుంచి ప్రధానమంత్రి పరీక్ష పే చర్చ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఇన్నోవాటే ఇండియా(Innovate India) 1.మై గవర్నమెంట్. ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. పార్టిసిపేట్ నౌ బటన్‌పై క్లిక్ చేసి, విద్యార్థి,టీచర్,తల్లిదండ్రులు అనే ఆప్షన్ ఎంచుకోవాలన్నారు.

మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ద్వారా లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేయాలని సూచించారు. అక్కడ ఇచ్చే చిన్న మల్టిపుల్ ఛాయిస్(Multiple Choice) ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలన్నారు. ఇందులో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు జనవరి 12 నుండి లభిస్తాయన్నారు. పోటీలో గెలుపొందిన వారికి ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశం, ప్రశంసా పత్రాలు, ‘ఎగ్జామ్ వారియర్స్’ కిట్‌లు బహుమతిగా లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని విద్యార్థులు టీచర్లు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కోరారు.

Leave a Reply