Dileep | అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

Dileep | అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
టిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం
Dileep | అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : ఈనెల 14న జరుగునున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాత అల్లిగూడెం గ్రామపంచాయతీ నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న నారం దిలీప్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పంచాయతీ పరిధిలో ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈసందర్భంగా నారం దిలీప్ మాట్లాడుతూ… 14న జరిగే ఎన్నికల్లో పంచాయతీ పరిధిలోని ఓటర్లు కత్తెర గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తద్వారా పాత అల్లిగూడెం గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపుతానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సత్య వరపు సంపూర్ణ, బజారయ్యా, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
