EX MINISTER | ప్రజా సమస్యలు పరిష్కరిస్తా

EX MINISTER | ప్రజా సమస్యలు పరిష్కరిస్తా
EX MINISTER | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి.. ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని మంతటి గ్రామపంచాయతీ టీఆర్ఎస్ అభ్యర్థి కుమ్మరి శీనువాసులు హామీ ఇచ్చారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బలపరిచిన కుమ్మరి శీను ప్రచారంలో దూసుకెళుతున్నారు. మంతటి గ్రామపంచాయతీ ముందు ఏర్పాటు చేసిన సభలో శ్రీను మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తాను గతంలో పోటీ చేసి ఓడిపోయానని ఈ పర్యాయం సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని.. మాజీ ఎంపీటీసీ నాగయ్య ఇతర టీఆర్ఎస్ నాయకులు అందరి మద్దతుతో గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడానికి పోటీ చేస్తున్నానని మీరందరూ సహకరించాలని కోరారు.
అసంపూర్తిగా ఉన్న స్కూల్ బిల్డింగును పూర్తి చేస్తానని.. గ్రామానికి చుట్టూ ఉన్న చిన్న ముద్దనూరు జమిస్తాపూర్, పెద్ద ముద్దునూరు రోడ్లను కొత్తగా వేయిస్తానని, సీసీ రోడ్లు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ హయాంలో రెండు కోట్లతో సీసీ రోడ్లు, రెండు కోట్లతో అండర్ డ్రైనేజీ పనులు, 50 లక్షలతో గ్రామపంచాయతీ భవనం 18 లక్షలతో స్మశానవాటిక.. ఈ పనులను చేసామని మాజీ ఎంపీటీసీ నాగయ్య తెలిపారు. రాబోయే కాలంలో ప్రజలకు సేవ చేయడానికి టీఆర్ఎస్ అభ్యర్థి కృషి చేస్తాడని అందరూ సహకరించాలని నాగయ్య కోరారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని ప్రజల నుండి స్పందన బాగా ఉందని అభ్యర్థి శీను చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి వెంట గ్రామ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉన్నారు.
