Swarupa | మల్లక్కపేట్లో బీజేపీ జోరుగా ప్రచారం

Swarupa | మల్లక్కపేట్లో బీజేపీ జోరుగా ప్రచారం
Swarupa | పరకాల, డిసెంబర్ 9(ఆంధ్రప్రభ): పరకాల మండలం మల్లక్కపేట గ్రామ సర్పంచ్ బీజేపీ అభ్యర్థి తిక్క స్వరూప ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థి స్వరూప మల్లక్కపేట గ్రామ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ రోజు గ్రామంలో స్వరూప వాడవాడలా తిరుగుతూ ఓటర్లను కలిశారు. తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. బీజేపీ సహకారంతో గ్రామానికి అత్యధిక నిధులు తీసుకువస్తానని హామీ ఇస్తున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని భరోసా కల్పిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రచారంలో వారివెంట నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
