sports | పురిటి గడ్డకు సేవ చేసేందుకే.. నేను పోటీ చేస్తున్నా..

sports | పురిటి గడ్డకు సేవ చేసేందుకే.. నేను పోటీ చేస్తున్నా..

  • ఒక్క అవకాశం ఇవ్వండి..మీ వెన్నంటే ఉంటా..
  • గెలిపించే బాధ్యత మీది..అభివృద్ధి చేసే బాధ్యత నాది

sports | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : నేను పుట్టిన పురిటి గడ్డకు సేవ చేసేందుకే మన గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ వెన్నంటే ఉంటాను.. నన్ను గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది.. డిసెంబర్ 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఒకటోవ నెంబర్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అవకా శం కల్పించాలని సీపీఎం, బీజేపీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి జూలు కుంట్ల శిరీష్ రెడ్డి కోరారు.

ఈ రోజు మండలంలోని రంగ‌రాయి గూడెంలో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ గా గెలిపించి ప్రజా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను వేడుకున్నారు. ఎన్నికల్లో విజయమిస్తే ఎమ్మె ల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడ తానని స్పష్టం చేశారు.

ఆలాగే గ్రామ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాను. అనంతరం ఆయన గ్రామ ప్రజలకు అభివృద్ధి హామీల(development promises)ను ప్రకటించారు. కాశిగూడెంకు మట్టి రోడ్డు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరుస్తాను. స్మశానవాటిక రోడ్డు నిర్మా ణం చేసి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాను. ఎస్సీ కాలనీలో సైడ్ కాలు వలు, అలాగే నూతన గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు చేస్తాను. బీసీ కాలనీలో సైడ్ కాలువలు, మహిళా భవనం నిర్మాణం చేపడతాను.

వీధి దీపాల నిర్వహణను నిత్యం పర్యవేక్షిస్తాను. అర్హులందరికీ ప్రభుత్వ సహకారంతో సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తాను. వృద్ధు లకు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాను. యువతలోని క్రీడా ప్రతిభ(sports talent)ను వెలికి తీసేందుకు కృషి చేస్తాను.

గ్రామంలో ప్రధాన సమస్యలపై సత్వర చర్యలు తీసుకుంటా ను. ముఖ్యంగా ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శక పాలన అంది స్తాను. గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారం కోరుతున్నానని అభ్యర్థి శిరీష్ రెడ్డి అన్నారు.

Leave a Reply