Meeting | మెరుగైన వైద్యం అందించాలి

Meeting | మెరుగైన వైద్యం అందించాలి

  • జనగాం డీఎంహెచ్ఓ మల్లికార్జున్

Meeting | కొడకండ్ల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ను జనగాం డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్ సందర్శించారు. హాస్పిటల్ లోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవల(Medical services) గురించి ఆరాతీశారు. హాస్పిటల్ లోని మందులు లభ్యత, పారిశుద్ధ్య పరిస్థితులను కూడా పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో డీఎంహెచ్వో మల్లికార్జున్ మాట్లాడుతూ… ఆరోగ్య సేవల నాణ్యత(Quality of health services)ను మరింత మెరుగు పరచాలని, ప్రజలకు సమర్థవంతమైన సేవలందించేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణ రెడ్డి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply