Relief Fund Checks | సీఎం సహకారం వలనే..

Relief Fund Checks | గుడివాడ, ఆంధ్రప్రభ : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. సమర్ధుడైన నాయకుడు ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుంది అనడానికి ఆయన పాలనే నిదర్శనం(Governance is the proof) అన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక (టీడీపీ) కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 20 బాధిత కుటుంబాలకు మంజూరైన రూ.10.05 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము బాధితులకు అందజేశారు. చెక్కుల అందుకున్న బాధిత కుటుంబాలను(Affected families) ఎమ్మెల్యే రాము ఆత్మీయంగా పలకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం వలనే చెక్కులు వచ్చాయని వారికి చెప్పారు. అనంతరం బాధితులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ(Coalition Govt) 18 నెలల పాలనలో గుడివాడ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో రూ.3.41 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశామన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు రాజీలేకుండా పని చేస్తున్నారని కొనియాడారు. ఒక వైపు పరిశ్రమలు తీసుకొస్తూ, ఉద్యోగ అవకాశాలు(Job Opportunities) కల్పిస్తూనే మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు. అవిశ్రాంతంగా కష్టపడుతున్న సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, టీడీపీ నాయకులు పండ్రాజు సాంబయ్య, మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, ముల్లపూడి రమేష్ చౌదరి(Mullapudi Ramesh Chowdhury), కర్రె వెంకటగిరి, పొట్లూరి కృష్ణారావు, పోలాసి ఉమయ్య(Polasi Umayya), కంచర్ల సుధాకర్, రామిదేని వేణుబాబు, నిమ్మగడ్డ సత్యసాయి, గోకవరపు సునీల్, ఏసు పాదం, సింగాల రాధాకృష్ణ, బొంబాయి శ్రీను, జనసేన నాయకులు సందు పవన్, కొదమల గంగాధర్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply