Manthani | కత్తుకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా

Manthani | కత్తుకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా
Manthani | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం రచ్చపల్లి సర్పంచ్ బరిలో జనగామ రత్నదీప నర్సింగరావు ఉన్నారు. రత్నదీప నర్సింగరావు గతంలో సర్పంచ్ గా పని చేసిన అనుభవం ఆమెకు కలిసొచ్చే అంశం. మచ్చలేని రాజకీయ జీవితం జనగామ దంపతుల సొంతం. వాగ్దేవి విద్యాలయం ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు నిస్వార్ధమైన సేవలు అందించారు. ప్రజాసేవలో జనగామ నర్సింగరావు సర్పంచ్ గా, వైస్ ఎంపీపీగా సేవలందించారు. నర్సింగరావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు గెలుపులో జనగామ నరసింహారావు పాత్ర మరువలేనిది అని చెప్పవచ్చు. జనగమ నరసింహారావు సతీమణి రత్నదీప గతంలో సర్పంచిగా ప్రజాసేవ చేశారు. ప్రస్తుతం రచ్చపల్లి మహిళా అభ్యర్థికి కేటాయించడంతో ఆమె బరిలో నిలుచున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రచ్చపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఒక్కసారి అవకాశం కల్పించాలని ఆమె కోరుతున్నారు.
ప్రచారంలో సైతం ఆమె దూసుకవెళ్తున్నారు. ఎం.ఏ పొలిటికల్ సైన్స్ విద్య అర్హతలు కలిగిన రత్నదీప వైపే గ్రామస్తులు మొగ్గు చూపుతున్నారు. ఉన్నత విద్యావంతురాలుగా, సర్పంచ్ గా, ప్రజలకు ఎనలేని సేవలు చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా జనగామ దంపతులు నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడంలో ఎల్లప్పుడూ ముందుండేవారు. వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమె విజయం సాధిస్తుందని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రచ్చపల్లి గ్రామంలో సర్పంచ్ గా గెలిచిన అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో ముందుంటారని ఆమె పేర్కొన్నారు. వాడవాడనా ప్రజలంతా ఆమె తరఫున ప్రచారం చేయడం విశేషం. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆమె ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రజల కోసం ప్రజాసేవ కోసం ముందుకొచ్చినట్లు ఆమె చెప్పారు. కత్తెర గుర్తుకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తానని ఆమె హామీ ఇస్తున్నారు.
