వెలగపూడి : ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏపీ గ్యాస్, డ్రోన్ కార్పోరేషన్ల అదనపు బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ ను నిన్న ఆ బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఈ కొత్త నియామకాన్ని ప్రభుత్వం చేసింది.
AP ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య
