- రేవోజిపేట సర్పంచ్ అభ్యర్థి కొల మహేష్…
దస్తురాబాద్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా రేవోజిపేట గ్రామ సర్పంచ్ బరిలో యువ నాయకులు కొల మహేష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ప్రజలకు సేవ చేయడంలోనే ఆనందం ఉందని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని వాడ వాడ తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. సర్పంచిగా గెలిచిన తర్వాత గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు

