Khanapur | గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా
Khanapur | ఖానాపూర్, ఆంధ్రప్రభ : కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ సర్పంచ్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి కోరారు. గతంలో ఈ గ్రామానికి ప్రశాంత్ రెడ్డి తండ్రి నర్సింహారెడ్డి సర్పంచ్‌గా కొనసాగారు. తల్లి పుష్ప దేవి కూడా సర్పంచిగా ఆ ఊరికి సేవలు అందించారు. ఇప్పుడు వారి కొడుకునైన తనకు అవకాశం ఇస్తే పాత ఎల్లాపూర్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

