BRS | గ్రామాభివృద్ధికి సేవకుడిలా పని చేస్తా..

BRS | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నారక్కపేట గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అవకాశం ఇస్తే.. ప్రజల సేవకుడిలా పని చేస్తానని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దండెం సంపత్ ఫుట్బాల్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. గ్రామ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా సేవ చేయడం తన లక్ష్యమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి సూచనలతో పార్టీ తరఫున సంపత్‌ను సర్పంచ్ అభ్యర్థిగా నిలిపినట్లు వెల్లడించారు. దండెం సంపత్ ఎమ్మెస్సీ, బీఈడీ చేసి మదర్ థెరిసా మండల సమైక్య సిఎ‌గా పని చేశారు. గ్రామాభివృద్ధికి మరింత సమయాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో సర్పంచ్ పదవికి పోటీ చేయడం జరిగింది. గ్రామ ప్రజల మద్దతుతో నారక్కపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సంపత్ అన్నారు.

Leave a Reply