దేవస్థానం కాంట్రాక్టర్ల పై నియంత్రణ..

  • ఆలయ సిబ్బందితో ప్రత్యేక పర్యవేక్షణ..
  • స్వాగత హోర్డింగులతో విస్తృత ప్రచారం…
  • వినియోగంలోకి వేద పాఠశాల ఖాళీ స్థలం…
  • ఘాట్ రోడ్డు తక్షణ మరమ్మత్తులు నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణం…
  • దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశంలో చైర్మన్ ప్రతిపాదనలు….
  • నిర్ణయించిన 16 తీర్మానాలలో 12 ఆమోదం..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : నిత్యం వేల సంఖ్యలో కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తుల అభిప్రాయాలు ఫిర్యాదులు నేపథ్యంలో దుర్గ గుడిలో ఉన్న కాంట్రాక్టర్ల ఇష్టరాజ్యంపై నియంత్రణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ పేర్కొన్నారు.

ఆలయ సిబ్బందితో వీరిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని అభిప్రాయపడిన ఆయన ట్రస్ట్ బోర్డు సమావేశంలో దీనికి సంబంధించి పలు ప్రతిపాదనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సర్వసభ్య సమావేశం నగరంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న జమ్మిదొడ్డిలో ట్రస్ట్ చైర్మన్ బొర్రా గాంధీ అధ్యక్షతన ఆలయ కార్యనిర్వహణ అధికారి శీనా నాయక్ పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు.

ఈ ట్రస్ట్ బోర్డు సమావేశంలో అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, జరుగుతున్న పనులు, భవాని దీక్షల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్ల వంటి అంశాలపై సమావేశంలో సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా సర్వసభ్య సమావేశంలో నిర్ణయించిన ఎజెండా అంశాలలో 16 వాటిలో 12 తీర్మానాలను బోర్డు ఆమోదించగా మరో నాలుగు అంశాలకు సంబంధించి వాయిదా వేయడంతో పాటు మరింత పరిశీలన కోసం పంపించారు.

వీటిలో ముఖ్యంగా భవాని దీక్షల విరమణకు సంబంధించి సాంకేతిక విభాగము ప్రొవిజన్ స్టోర్స్ అన్నదాన విభాగము నుండి వచ్చిన టెండర్లు ప్రక్రియను ఆమోదిస్తూ బోర్డు తీర్మానించింది. దత్తత దేవాలయము శ్రీ వేణుగోపాల ఆంజనేయస్వామి ఆలయంలో పనిచేస్తున్న గోశాల కాపరికి జీతం పెంచే విషయాన్ని కూడా ఆమోదించారు.

25-26 ఆర్థిక సంవత్సరంలో దేవస్థానంలో అక్టోబర్ నెల వరకు సంబంధించిన ఆదాయ వేయాల వివరాలను ఆమోదించారు. లీజుల విభాగం ప్రతిపాదించిన టెండర్లకు సంబంధించిన పలు అంశాలను కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆమోదించారు.

అయితే అమ్మవారి కొండపైన కొండ చర్యలు వెలుగు పడకుండా 130 మీటర్ల నుండి 230 మీటర్ల వరకు, మరో ప్రాంతంలో 400 మీటర్ల నుండి 500 మీటర్ల వరకు ఘాట్ రోడ్డు వెంబడి కొండకు రక్షణ కల్పించే పని అంచనాల వివరాలను మాత్రం ఉన్నతాధికారులకు నివేదిక పంపించే విధంగా తీర్మానం చేశారు. ట్రాన్స్పోర్ట్ విభాగంలో 14 మంచి డ్రైవర్లను కొత్తగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు ఎజెండాలోని తీర్మానాన్ని ఆమోదించారు. వీటితో పాటు పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

చైర్మన్ ప్రతిపాదనలు..

దుర్గగుడి పాలకవర్గ సమావేశంలో చైర్మన్ బొర్రా గాంధీ పలు ప్రతిపాదనలను ట్రస్ట్ బోర్డు సమావేశం ముందు ఉంచారు. వీటిలో అతి ముఖ్యమైనది భవాని దీక్షలో అనంతరం ఘాట్ రోడ్డుకు తక్షణ మరమ్మత్తులు చేపట్టడం, నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదన చేశారు.

వీటితో పాటు భక్తుల హుండీలో కానుకలు వేయడానికి ఇతర అవసరాల కోసం నగదు అందుబాటులో ఉంచే విధంగా రెండు కొత్త ఏటీఎం కేంద్రాలను ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదించారు. పోరంకి లోని వేద పాఠశాల వద్ద ఉన్న ఆరు ఎకరాల స్థలాన్ని అభివృద్ధి చేసే విధంగా పచ్చని ఉద్యానవనంగా తీర్చే విధంగా ప్రతిపాదన చేశారు.

కనకదుర్గ ఫ్లైఓవర్ తో పాటు నవ రాజధాని పరిసర ప్రాంతాలలో అమ్మవారి స్వామివారి స్వాగత కోటింగులు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదన చేశారు. మరో అతి ముఖ్యమైన అంశం లో క్లాక్ రూమ్ చెప్పులు స్టాండ్ సెల్ఫోన్ కాంట్రాక్టులను నియంత్రించే విధంగా నిర్వహణలో ఉన్న ఆ ప్రాంతాలలో దేవస్థానం నుండి ఒక కంప్యూటర్ దేవస్థానం సాఫ్ట్వేర్ అలాగే ఒక ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించే విధంగా ప్రతిపాదించారు.

ఆయా ప్రాంతాలలో టికెట్ ను దేవస్థానం సిబ్బంది కంప్యూటర్ ద్వారా మాత్రమే జారీ చేసి మిగిలిన పని కాంట్రాక్టర్లు పర్యవేక్షించేలా నియంత్రించే వాటినే ప్రతిపాదించారు. ఈ అంశాలను తర్వాత జరిగే ట్రస్ట్ బోర్డు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply