- ఆజిపల్లి సర్పంచ్ అభ్యర్థి కారుకొండ నవీన్ కుమార్
షాద్ నగర్, ఆంధ్ర ప్రభ : హాజిపల్లి గ్రామాన్ని మరింత సుందరంగా తీర్చి దిద్దుతానని యువతకు అవకాశం కల్పించి అభివృద్ధి పరిచే వారికి పట్టం కట్టాలని హాజీపల్లి ప్రజలకు ఆజిపల్లి సర్పంచ్ అభ్యర్థి కారుకొండ నవీన్ కుమార్ అన్నారు. తాను షాద్నగర్ నుండి కిషన్ నగర్ వరకు డబ్బులు రోడ్డు వేయిస్తానని అదేవిధంగా కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తనకు అవకాశం కల్పిస్తే హాజిపల్లిని అంగాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. యువత ఉద్యోగ అవకాశాలు స్థానిక పరిశ్రమలలో కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

