MPP | ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు….

MPP | ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు….

MPP | బిక్కనూర్, ఆంధ్రప్రభ : బిక్కనూరు పట్టణంలో ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తానని కాంగ్రెస్ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బల్యాల రేఖా సుదర్శన్ హామీ ఇచ్చారు. ఆమె ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి కాలనీలో మురికి కాలువలు, సిమెంట్ రోడ్లు నిర్మిస్తానని హామీ ఇస్తూ తమను గెలిపించాలని కోరుతున్నారు. విద్యావంతురాలుగా గతంలో ఎంపీపీగా పనిచేసిన అనుభవం తమకు ఉందని గుర్తు చేశారు. ఆమె నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. సర్పంచ్ గా అవకాశం కలిపిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు

Leave a Reply