- జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి
ఆంధ్రప్రభ బ్యూరో, శ్రీకాకుళం : జిల్లా పోలీసు వ్యవస్థలో హోం గార్డులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి అన్నారు. ఈ రోజు తండేంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మైదానంలో నిర్వహించిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఎస్పీకి పరేడ్ కమాండర్ హోంగార్డ్ శశి భూషణ్ గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైజింగ్ డే పరేడ్ ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనంతరం శాంతి సూచకంగా బెలూన్లు, పావురాలను గాల్లోకి వదిలారు. పరేడ్‌లో 4వ ప్లాటూన్ మొదటి బహుమతి గెలుచుకుంది.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన పరేడ్ కమాండర్, ప్లాటూన్ కమాండర్, సిబ్బందికి ఎస్పీ మెడల్స్‌తో సత్కరించారు. ఇటీవల రిటైర్డ్ హోంగార్డు రమణ మూర్తికి జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డు విభాగం వారి ఒక రోజు గౌరవ వేతనం 4.18 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని జిల్లా ఎస్పీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు,డిఎస్పీ సి హెచ్ వివేకానంద, ఏఓ సి హెచ్ గోపినాథ్, సిఐలు ఇమ్మాన్యుల్ రాజు,పైడిపు నాయుడు, ఈశ్వర రావు, అవతారం,సూర్య చంద్ర మౌలి, సన్యాసి నాయుడు, సత్యనారాయణ,ఆర్ఐలు నర్శింగరావు, క్రిష్ణ ప్రసాద్, ఆర్ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

