Cluster | అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి

Cluster | అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి


రెండవ విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పరిశీలన‌


నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
Cluster | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని పాలెం క్లస్టర్‌లో వచ్చే రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఉపసంహరణ, ప్రక్రియను శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, వెంకటాపూర్, పాలెం, ఖానాపూర్ గ్రామపంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… సర్పంచ్‌, వార్డు స్థానానికి ఉపసంహరణకు అభ్యర్థుల నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలి, ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థులతో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అదేసమయంలో పోటీలో ఉన్న ఒకేఒక్క అభ్యర్థి నుంచి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం డబ్బు ఎర చూపలేదని, వేలంపాటలో పాల్గొనడం, బెదిరింపులకు పాల్పడడం వంటివి చేయలేదని ధ్రువీకరించే పత్రాన్ని తీసుకోవాలని తెలిపారు.

ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలు పాటించడంపై ఆయన అధికారులు దృష్టి సారించాలని సూచించారు. అన్ని పత్రాలను సక్రమంగా నమోదు చేయడం, అభ్యర్థులకు పూర్తి సమాచారం అందించడం, ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలను ఆయన ప్రత్యేకంగా సూచించారు. పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లను చేపట్టింది. జిల్లా కలెక్టర్ వెంట బిజినపల్లి తహసీల్దార్ మునరుద్దీన్, ఎన్నికల అధికారులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply