MLA | అంబేద్కర్ జీవితం మార్గదర్శకం

MLA | అంబేద్కర్ జీవితం మార్గదర్శకం

ఎమ్మెల్యేలు నాయిని రాజేంద‌ర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు

MLA | హన్మకొండ చౌరస్తా, డిసెంబర్ 6 (ఆంధ్రప్రభ) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 69 వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డితో కలిసి హనుమకొండ డీసీసీ భవన్‌లో అంబేద్కర్ చిత్రానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం అంబేద్కర్ కూడలి వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత పోరాటం ప్రతి పౌరుడికి మార్గదర్శకం. ఆయన రచించిన రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలను దేశానికి అందించింది. ఈ విలువలను కాపాడడం మనందరి బాధ్యత. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా పని చేయడం అంబేద్కర్ చూపిన దారిలో నడిచే నిజమైన గౌరవం అని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రతిజ్ఞా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు విజయశ్రీ రాజాలీ, మామిండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply