Bantumilli | అది.. రాజ్యాంగ ఫలితమే..

Bantumilli | అది.. రాజ్యాంగ ఫలితమే..

Bantumilli | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి స్మృత్యంజలి కార్యక్రమాన్ని బంటుమిల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బంటుమిల్లి పట్టణంలో అంబేద్కర్ (Ambedkar) సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బంటుమిల్లి మండల జై భీమ్ యూత్ కమిటీ వారిచే ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో దళిత ఉద్యోగులు, నాయకులు, యువకులు, వ్యాపారులు వివిధ చేతి వృత్తులు పని వారు, పలు రాజకీయ పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాన వక్తలు మాట్లాడుతూ… మరణించి 69 ఏళ్లు గడిచినా ప్రజలందరి దేవుడైన అంబేద్కర్ ప్రతి ఒక్కరు మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, బడుగు వర్గాలు రాజ్యాంగ పదవుల్లో గౌరవంగా నిలుచున్నా, కోట్లాదిమంది ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నా అది మహానీయుడు అంబేద్కర్ పెట్టిన భిక్ష అని, వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ నడవాలని ఆకాంక్షించారు.

దేశంలో విభిన్న కులాలు, మతాలకు చెందిన అందరం కలసి మెలసి ఉన్నామంటే.. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమే అన్నారు. అందరం కలసి మెలసి ఉంటూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని యావత్ భారత దేశాన్ని కలిపి ఉంచే ఒకే ఒక పేరు అంబేద్కర్ అని, ప్రపంచంలోనే అతి గొప్ప పెద్ద రాజ్యాంగాన్ని రచించి ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహానీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతామని విచ్చేసిన వారందరూ ప్రతిజ్ఞ చేశారు.

ఈ వర్ధంతి కార్యక్రమంలోమార్కెట్ (Market) యార్డ్ వైస్ చైర్మన్ భూపతి రమేష్, బంటుమిల్లి గ్రామ వైస్ సర్పంచ్ గొల్ల నవీన్, మాజీ ఎంపీపీ పాలడుగు వెంకటేశ్వర రావు, మాజీ సర్పంచ్ ఆకునూరి శాంసన్, మాజీ జెడ్పీటీసీ దాసరి కరుణ జ్యోతి, ఉపాధ్యాయులు తోకల మోహన్ రావు, దండే వెంకటరత్నం, దాసరి శ్రీహరి, చిన్నం రవి కుమార్, దాసరి సాంబశివరావు, అర్జా రాంకీ, డక్కుమళ్ల ఆనంద్, దాసరి ప్రసాద్, చింతల డానియల్, దాసరి ప్రసాద్, ఈదా కిశోర్, చింటూ, బట్టు తంబి, దాసరి వినయ్, కూటమి నాయకులు ఆకునూరి రత్న కుమార్,ఎండీ నజీర్, సింగంశెట్టి శ్రీనివాస్ రావు, జొన్నల గడ్డ కొండ కొండలరావు, సన్నాల ప్రసాద్, దాసరి ఏడుకొండల, కొనాల బాలరాజు, పెందుర్రు కొండ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply