Ambedkar | దేశానికి మార్గ నిర్దేశకుడు..
- బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన మహోన్నత వ్యక్తి
- తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
- తణుకులో అంబేద్కర్ వర్థంతి
Ambedkar, తణుకు, ఆంధ్రప్రభ : భిన్న మతాలు, కులాలు, వర్గాల హక్కులను కాపాడే విధంగా ఒక మార్గాన్ని నిర్దేశించిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతీ ఒక్కరు నడుచుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని ఈ రోజు తణుకు (Tanuku) మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, వివిధ దళిత సంఘాలకు చెందిన నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

