Mahender Reddy | కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు
డీసీసీబీ మాజీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి
Mahender Reddy | ఆంధ్రప్రభ, యాదాద్రి ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) కు ఓట్లు అడిగే హక్కు లేదని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మెన్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ మాజీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం యాదగిరిగుట్టలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందన్నారు.
కేసీఆర్ పాలనలో పల్లెలు పచ్చని తోరణంలా స్వాగతం పలికితే, నేడు గ్రామాల్లో నిధుల్లేక పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, స్మశాన వాటికల నిర్మణాలతో పల్లె శోభను తీసుకురాగా.. నేడు ఇందిరమ్మ పాలనలో పల్లెలు అభివృద్ధికి దూరమయ్యాయని చెప్పారు. ఎన్నికల (Election) ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మాట తప్పిందని, గ్రామాల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. పంచాయితీ ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని, ఊరూరా గులాబీ జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు.

