Medical | పశు వైద్యాధికారి కావలెను..

Medical | పశు వైద్యాధికారి కావలెను..


Medical | ఘంటసాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ఘంటసాలలో ఉన్న పశు వైద్యశాలకు రెగ్యులర్ వైద్యాధికారి లేకపోవడంతో పశు పోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పశువైద్య కేంద్రం సమీపంలో 8 గ్రామాల పశుపోషకులకు మూగజీవాలు ఉన్నాయి. వైద్యాధికారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సిబ్బంది మాత్రమే వైద్య సేవలు (Medical services) అందివ్వడంతో.. రెగ్యులర్ వైద్యాధికారి కావాలని కోరుతున్నారు. శ్రీకాకుళం గ్రామానికి చెందిన పశు వైద్యాధికారికి ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించినప్పటికీ, ఘంటసాల పశువైద్యాధికారిగా రెగ్యులర్ పశు వైద్యాధికారిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు స్పందించి రెగ్యులర్ వైద్యాధికారిని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply