Gram Panchayat | ఒక్క ఛాన్స్ ఇస్తే..
Gram Panchayat, రామన్నపేట, ఆంధ్రప్రభ : గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని లక్ష్మాపురం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బత్తుల జ్యోతి నవీన్ అన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తానని.. తనని అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం ఆశీస్సులతో తాము కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి పోటీ చేస్తున్నామని.. యువ మహిళ నైనా.. అందరికీ అందుబాటులో ఉంటానని.. అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు. మీరందరూ నన్ను ఆదరించి లక్ష్మాపురం సర్పంచ్ గా అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

