Tangutur | ఊపందుకుంటున్న బద్దం హరిత కృష్ణారెడ్డి ప్రచారం…

శంకర్‌పల్లి, ఆంధ్రప్రభ : శంకర్‌పల్లి మండలంలోని టంగుటూరు గ్రామంలో బద్దం హరిత కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం వేగంగా ఊపందుకుంటోంది. గ్రామస్తులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, మంచికీ–చెడుకీ తోడుగా ఉండే వ్యక్తిగా హరిత కృష్ణారెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు.

ఇంటింటి ప్రచారంలో ఆయనకు అపూర్వమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువత ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏ ఇంటికి వెళ్లినా కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ ఆహ్వానిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గ్రామానికి సేవ చేయడానికి ముందుకు వచ్చిన హరిత కృష్ణారెడ్డిని సర్పంచ్‌గా గెలిపించేందుకు సిద్ధమే అని గ్రామస్థులు స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయం ఖాయమన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది.

Leave a Reply