పేదల సొంతింటి కల సాకారం

  • ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు

తిరువూరు, ఆంధ్ర ప్రభ : సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు మరో అడుగు ముందుకు వేశారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పీఎంఏవై అర్బన్ – 2.0 పథకం కింద పట్టణంలోని 138 మంది పేద కుటుంబాలకు గృహ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణంలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు చొప్పున నివేశన స్థలాలను త్వరలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

తిక్కు గృహ సముదాయాలను కూడా త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

పేదల సొంతింటి కల సహకారం చేయడం కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యమని, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.

Leave a Reply