MLA | గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను

MLA | గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను

MLA | నవాబుపేట, ఆంధ్రప్రభ : నాపై నమ్మకంతో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని కాంగ్రెస్ పార్టీ(Congress party) బలపరిచిన అభ్యర్థి శ్రీవాణి అంజయ్య ప్రచారం ప్రారంభించారు. నవాబుపేట మండలం కేంద్రానికి చెందిన శ్రీవాణి అంజయ్యను కాంగ్రెస్ పార్టీ బలపరచడంతో గ్రామంలో ఉన్న సమస్యలను తొలగించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ రోజు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రజల ప్రభుత్వం అని ప్రజలు తమకు ఓటు వేసి భారీ మెజార్టీతో(huge majority) గెలిపించి తమను ఆశీర్వదిస్తే గ్రామానికి ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే సహకారం(MLA support)తో నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇస్తూ కార్యకర్తలతో గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply