Filing nomination | సర్పంచ్ స్థానానికి బాదావత్ రాంబాబు నామినేషన్
Filing nomination | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : పాపకొల్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న నన్ను ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తానని బాదావత్ రాంబాబు తెలిపారు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి బాదావత్ రాంబాబు నామినేషన్ దాఖలు(Filing of nomination) చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రాంబాబు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ(Congress party) బలపరిచిన అభ్యర్థిగా పోటీ లో నిలుస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి, సంక్షేమానికి తోడ్పడతానని హామీ ఇచ్చారు.
నిస్వార్ధంగా, అంకిత భావంతో ప్రజా సేవ చేసేందుకు పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన నాకు పాపకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్ల ఆశీస్సులు అందించాలని బాదావత్ రాంబాబు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోకటి రమేష్, రామిశెట్టి రాంబాబు, పాపిన్ని జనార్ధన్ రావు, మద్దిశెట్టి ప్రకాష్, గుమ్మడి వెంకటేశ్వర్లు, బాదావత్ లక్ష్మణ్, పాపిన్ని వెంకయ్య, ధరావత్ చందా, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి వీరయ్య పాలెపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

