Raikal | గ్రామ అభివృద్ధికి సహకరించండి
- రాయికల్ గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మామిడిపల్లి సురేఖ వెంకటరెడ్డి
Raikal | షాద్ నగర్, ఆంధ్రప్రభ : రాయికల్ ప్రజలు అభివృద్ధికి సహకరించి తనకు కేటాయించిన గుర్తుకు ఓటెయ్యాలని రాయికల్ సర్పంచ్ అభ్యర్థి సురేఖ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో (Election) భాగంగా ఆమె శుక్రవారం రాయికల్ గ్రామంలో వివిధ కాలనీల్లో ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మహిళలు యువకులతో చేపట్టారు.
గ్రామంలో మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తాము విజయఢంకా మోగిస్తామన్నారు. వార్డుల్లో (Ward) ఇప్పటికే తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. ఖచ్చితంగా విజయఢంకా మోగించడం ఖాయమని గ్రామ ప్రజలు, మహిళలు ధీమా వ్యక్తం చేశారు. ఈసందర్భంగా తనకు కేటాయించిన గుర్తుకే మన ఓటు వెయ్యాలని, సర్పంచ్ అభ్యర్థి మామిడిపల్లి సురేఖ వెంకటరెడ్డినే గెలిపించుకోవాలని గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు కోరారు. ఈ ప్రచారంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

