TG Advisor | జనరల్ ఆసుపత్రి పరిశీలన

TG Advisor | జనరల్ ఆసుపత్రి పరిశీలన


TG Advisor | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ పట్టణంలో లైన్స్ క్లబ్ ఏర్పాటు చేయనున్న జనరల్ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శుక్రవారం సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) పరిశీలించారు. పేదలకు సేవలందించే విధంగా ఏర్పాటు చేస్తున్న జనరల్ ఆసుపత్రికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజుల వసూళ్లను రోగులు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. ఫీజుల దృష్టితో కాకుండా సేవా దృక్పథంతో ఆసుపత్రి ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందించారు. ఆసుపత్రిలో చేపట్టబోయే వైద్య సహాయంపై లైన్స్ ప్రతినిధులు సుదర్శన్ రెడ్డికి వివరించారు. లైన్స్ ప్రతినిధులు బసవేశ్వర రావు, కొడాలి కిషోర్, నరసింహారెడ్డి, తదితరులున్నారు.

Leave a Reply