BRS | గెలిపిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా

BRS | గెలిపిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా

  • లొకిరేవ్ సర్పంచ్ అభ్యర్తి ధర్పల్లి అనసూయయాదయ్య


BRS | నవాబుపేట, ఆంధ్రప్రభ : గెలిపించండి.. అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ (BRS) పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధర్పల్లి అనసూయ యాదయ్య ఓటర్లను వేడుకున్నారు. మండలంలోని లొకిరేవ్ గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈనెల 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో (Election) కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనను అందించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామన్నారు.

గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడమే తన ధ్యేయమని, తాగునీటి (Water) సమస్య పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటు, మురికి కాలువల శుద్ధి, పేదలకు సహాయం వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానన్నారు. సర్పంచ్ గా కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులూ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply