Rs. 4 crores | కారులో పట్టుబడ్డ రూ.4కోట్ల నగదు..
Rs. 4 crores | సికింద్రాబాద్, ఆంధ్రప్రభ : బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో కారులో భారీగా అక్రమ నగదు తరలింపు బయటపడింది. బోయిన్పల్లి క్రైమ్(Boynpally Crime) పోలీసులు ముందస్తు సమాచారంతో చేసిన తనిఖీలో కారు టైరు, సీట్ల కింద దాచిన రూ.4 కోట్లు(Rs. 4 crores) హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ మొత్తాన్ని తరలిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోలీసులు గత ఏడాదిగా నిఘా ఉంచినట్లు తెలిసింది. పుష్పసినిమా తరహాలో నగదు తరలిస్తుండగా పట్టుబడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.

